Brazil: అమెజాన్ ఉప నదిలో మునిగిన పడవ.. 18 మంది జలసమాధి

18 killed as boat sinks in Brazilian Amazon
  • జారి నదిలో ప్రయాణిస్తూ మునిగిన పడవ
  • 46 మందిని రక్షించిన అధికారులు
  • 30 మంది ఆచూకీ గల్లంతు
అమెజాన్ ఉపనది జారిలో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో18 మంది జల సమాధి అయ్యారు. బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 46 మందిని రక్షించారు. ప్రయాణికుల్లో 30 మంది గల్లంతయ్యారు. వారి జాడ కనుగొనేందుకు హెలికాప్టర్లు, విమానాలు, గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Brazil
Amazon River
Boat Capisize

More Telugu News