Bommali Ravi Shankar: ఇంతవరకూ 3500 సినిమాలకి డబ్బింగ్ చెప్పాను: 'బొమ్మాళీ' రవిశంకర్

  • ఈ వాయిస్ మా నాన్న ఇచ్చిన ఆస్తి 
  •  నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను 
  • 'అరుంధతి'మంచి పేరు తెచ్చిందన్న రవిశంకర్  
Arundhathi Movie

సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పాప్యులర్. సుదీర్ఘకాలంగా ఆయన డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. కొన్ని సినిమాల్లో తన వాయిస్ కి తగిన ప్రతినాయక పాత్రలను కూడా చేశారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "మా నాన్నగారు తరగని ఆస్తిగా నాకు ఈ గొంతు ఇచ్చారు. ఈ వాయిస్ తో తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కలుపుకుని 3500 సినిమాల వరకూ డబ్బింగ్ చెప్పాను.

హిందీ సినిమాలకి డబ్బింగ్ చెప్పలేదు. కానీ హిందీ ఆర్టిస్టులు తెలుగులో చేసినప్పుడు మాత్రం వాళ్లకి నేనే డబ్బింగ్ చెప్పాను. అమితాబ్ .. డానీ .. ఆశిష్ విద్యార్ధి .. సాయాజీ షిండే .. ముఖేశ్ రుషి .. సోనూ సూద్ ఇలా చాలా మందికి వాయిస్ ఇచ్చాను. 'అరుంధతి' నాకు మరింత పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాకి ముందు అంతా నన్ను 'సాయిరవి' అని పిలిచేవారు. ఆ తరువాత 'బొమ్మాళీ' రవిశంకర్ అని పిలుస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News