Gotabaya Rajapksa: శ్రీలంక అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. పార్లమెంటు రద్దు

  • ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటు రద్దు 
  • ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం నిర్ణయం
  • ఏప్రిల్ 25న ఎన్నికలు .. ఈ నెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ
Sri Lankan Parliament Dissolved

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగానే ఆదివారం అర్ధరాత్రి పార్లమెంటును రద్దు చేశారు. నిన్న ఈ విషయాన్ని ప్రకటించారు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులో దేశంలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 25న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించిన అధ్యక్షుడు.. మార్చి 12 నుంచి 19వ తేదీ లోపు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసుకోవచ్చని తెలిపారు.

2015 నుంచి 2019 వరకు ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమ సింఘేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు రాజపక్స.. తన తమ్ముడైన మహీంద రాజపక్సేను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు.

More Telugu News