RGV: పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' కు వర్మ కౌంటర్

RGV reacts funny over Pawan Kalyan Vakeel Saab first look
  • పవర్ స్టార్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్
  • ట్విట్టర్ లో ప్రభంజనం
  • డైరెక్టర్ సాబ్ అంటూ వర్మ పోస్టు
ఏదైనా ట్రెండింగ్ అవుతున్న అంశంపై స్పందించి అందరి దృష్టిని ఆకర్షించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. తాజాగా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో పవర్ స్టార్ మేనియాతో ట్విట్టర్ ఊగిపోతోంది.​ ఈ నేపథ్యంలో వర్మ తనదైన శైలిలో కౌంటర్ పోస్టు చేశారు. వకీల్ సాబ్ కు ప్యారడీ గా డైరెక్టర్ సాబ్ అంటూ ఓ పిక్ ను రిలీజ్ చేశారు. వకీల్ సాబ్ లో పవన్ లుక్ ను అనుకరిస్తూ కాళ్లు బారచాపుకుని పోజిచ్చారు.​ "పిచ్చిపని కాని ఈ పనిని ఏ పిచ్చివాడైనా చేస్తాడని నేను అనుకోవడంలేదు" అంటూ కామెంట్ కూడా జత చేశారు.
RGV
Director Saab
Pawan Kalyan
Vakeel Saab
Twitter

More Telugu News