Nirbhaya: నిప్పుతో చెలగాటమాడుతున్నారు.. జాగ్రత్తగా ఉండండి: నిర్భయ దోషుల లాయర్ కు కోర్టు వార్నింగ్

  • రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న పవన్ గుప్తా
  • రేపటి ఉరిశిక్షను ఆపేయాలని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్
  • ఒక్క దోషి తప్పు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న జడ్జి
Delhi Court warns Nirbhaya Convicts Lawyer

రేపు ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ లకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ తరుణంలో తమ ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రపతికి తాను క్షమాభిక్ష పెట్టుకున్నానని, ఈ నేపథ్యంలో రేపటి ఉరితీత అమలును ఆపివేయాలంటూ పవన్ గుప్తా మరో పిటిషన్ వేశాడు.

పిటిషన్ ను విచారించిన పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా... తీర్పును రిజర్వ్ లో ఉంచుతూ, పవన్ తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పుతో చెలగాటమాడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నలుగురు దోషుల్లో ఏ ఒక్కరు తప్పుగా వ్యవహరించినా పరిస్థితులు మారుతాయని... ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసని అన్నారు.

మరోవైపు పవన్ వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలు అయిపోయాయని సుప్రీం వ్యాఖ్యానించింది.

More Telugu News