Yanamala: ఆ ప్రస్తావన గవర్నర్​ ప్రసంగంలో ఉండటానికి వీల్లేదు: ఏపీ టీడీపీ నేత యనమల

Ap Tdp leader Yanamala suggestion to Government
  • మార్చిలో బడ్జెట్ సెషన్ ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది
  • మండలి వ్యతిరేకించిన రెండు బిల్లుల ప్రస్తావన వద్దు
  • అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
మార్చిలో బడ్జెట్ సెషన్ నిర్వహించేముందు రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ విధంగా అయితే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారో, అదేవిధంగా గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేస్తుంటారని అన్నారు. శాసనమండలి వ్యతిరేకించిన రెండు బిల్లుల గురించిన ప్రస్తావన నిబంధనల ప్రకారం ఈ ప్రసంగంలో ఉండడానికి వీల్లేదని, అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వం పంపే ప్రసంగ కాపీని గవర్నర్ పరిశీలించాలని కోరారు.

ఒకవేళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాల గురించిన ప్రస్తావన ఉంటే కనుక సవరణలను ప్రతిపాదించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కనుక మొండిగా వ్యవహరిస్తే మండలిలో  ‘సేమ్ సీన్ రిపీట్’ అవుతుందని, ప్రతిపక్షం వ్యతిరేకత లేకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సూచించారు.
Yanamala
Telugudesam
Andhra Pradesh
Budget Session
Governor
speech

More Telugu News