Varalakshmi: పెద్ద హీరో కూతుర్నైన నేను కూడా వేధింపులు ఎదుర్కొన్నా: వరలక్ష్మి

Being a star kid I also faced casting couch says Varalakshmi Sharath Kumar
  • కొందరు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ నా వద్ద ఉన్నాయి
  • నో చెప్పినందుకు నన్ను బ్యాన్ చేశారు
  • స్వశక్తితో నేను సొంత కాళ్లపై నిలబడ్డాను
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే పలువురు సినీతారలు బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ అనుభవాలను వెల్లడించిన వారిలో సీనియర్ నటీమణులు, వర్థమాన నటీమణులు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ఈ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి.

తాజాగా తమిళ, తెలుగు సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. పెద్ద హీరో కుమార్తెను అయినప్పటికీ... తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నానని వెల్లడించింది. కొందరు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పింది. తాను నో చెప్పినందుకు తనను బ్యాన్ చేశారని... అయితే స్వశక్తితో తాను సొంత కాళ్లపై నిలబడ్డానని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ కు నో చెప్పడాన్ని అమ్మాయిలు నేర్చుకోవాలని సూచించింది.
Varalakshmi
Sharath Kumar
Tollywood
Kollywood
Casting Couch

More Telugu News