Hyderabad: హైదరాబాద్ లో నిన్న రాత్రి వర్షం... విద్యుత్ సరఫరాకు అంతరాయం!

Rain in Hyderabad
  • తెలంగాణపై ఉపరితల ద్రోణి
  • అకస్మాత్ వర్షంతో ప్రజల ఇబ్బందులు
  • మరో మూడు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కురిసింది చిన్నపాటి వర్షమే అయినా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అకస్మాత్తుగా వర్షం పడటంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పగలంతా ఉక్కపోతతో అల్లాడిన వారు, రాత్రి కురిసిన వర్షానికి కాస్తంత సేదదీరారు.

కాగా, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర మీదుగా కోస్తా పరిసర ప్రాంతాల వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతోనే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసిందని వెల్లడించారు. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.
Hyderabad
Rain
Traffic

More Telugu News