Hyderabad: పాన్‌షాప్ నుంచి రూ.70 వేల విలువైన సిగరెట్లు చోరీ చేసిన మహిళ

Woman theft Cigarettes from panshop in Hyderabad
  • హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఘటన
  • సీసీటీవీ పుటేజీ చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు
  • మహిళా దొంగ కోసం గాలింపు
మూసివున్న పాన్‌షాప్ నుంచి రూ.70 వేల విలువైన సిగరెట్లను ఎత్తుకెళ్లిందో మహిళ. హైదరాబాద్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్‌లోని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో శ్రీకాంత్ పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి షాపు మూసి ఇంటికెళ్లాడు. నిన్న ఉదయం యథావిధిగా షాపు తెరిచేందుకు వచ్చిన శ్రీకాంత్.. అది తెరిచి ఉండడం చూసి షాకయ్యాడు. లోపల ఉండాల్సిన రూ. 70 వేల విలువైన సిగరెట్లు మాయమైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. షాపులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సిగరెట్లు దొంగిలించింది ఓ మహిళ అని తెలిసి ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
karmanghat
cigarette
pan shop
theft

More Telugu News