Hyderabad: నలుగురి ఉసురు తీసిన ఆర్థిక సమస్యలు.. భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Family commit suicide in Hyderabad
  • హైదరాబాద్‌లోని హస్తినాపురంలో దారుణం
  • పురుగుల మందు తాగి ఆత్మహత్య
  • బాధితులను ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తింపు

హైదరాబాద్‌లోని హస్తినాపురంలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకు పురుగుల మందు తాగించి ఆపై వారు కూడా తాగి ప్రాణాలు తీసుకున్నారు. బాధితులను ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్, స్వాతి, వారి కుమారులు కల్యాణ్, జయకృష్ణలుగా పోలీసులు గుర్తించారు. ప్రదీప్ ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News