Ambati Rambabu: టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట?: అంబటి రాంబాబు ఫైర్​

Ambati Rambabu fires on TDP leaders
  • రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే రాజకీయం చేస్తారా?
  • టీడీపీ వాళ్లు, ధనికులు మాత్రమే అక్కడ ఉండాలా?
  • పేదలు ఉండకూడదా?
ఏపీ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదలకు ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు యిస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట? తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, ధనికులు మాత్రమే అక్కడ ఉండాలా? పేదలు ఉండకూడదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉగాది పండగ నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల  స్థలాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam
Amaravathi

More Telugu News