Posani Krishna Murali: జగన్ పై అలగడం ఈ జన్మకు జరగని పని: పోసాని

Posani Krishnamurali opines on CM Jagan
  • ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పోసాని
  • జగన్ సీఎం అయ్యాక ఆయన గురించి ఇంకేం చెప్పగలమంటూ వ్యాఖ్యలు
  • పదవులపై ఆశ లేదని స్పష్టీకరణ

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ పై అలగడం కానీ, జగన్ తనపై అలగడం కానీ ఈ జన్మకు జరగని పని అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఒక్కసారి జగన్ కు ఓటేయమని ప్రజలకు సూచించానని, ఒక్కసారి సీఎం అయ్యాక ఆయనకే పదేపదే ఓట్లేస్తారని జనాలకు చెప్పానని వివరించారు. ఇప్పుడాయన సీఎం అయ్యాక కూడా ఆయన పక్కనుండి తాను ఇంకేం చెప్పగలనని అన్నారు. తనకు పదవులపై ఆశ లేదని, సేవ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమేనని తెలిపారు. కొన్నినెలల కిందట కూడా తనను పదవి విషయంలో సంప్రదించారని, తాను అందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు.

అమరావతి ఒకే సామాజిక వర్గానికి చెందినది అని పృథ్వీ చేసిన వ్యాఖ్యలను మీరు ఖండించిన తర్వాత సీఎం జగన్ మీపై అసంతృప్తితో ఉన్నట్టు భావించవచ్చా అని యాంకర్ ప్రశ్నించగా.... తాను అలా భావించడంలేదని అని అన్నారు. జగన్ కు కులగజ్జి అస్సలు లేదని, ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే ఆయన్ను సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. పృథ్వీలాంటి వాళ్లు చేసే పిచ్చి వ్యాఖ్యలతో జగన్ విశ్వసనీయత ఏంకావాలి? అని ఆవేదన కలిగిందని, అందుకే పృథ్వీ వ్యాఖ్యలను ఖండించానని అన్నారు.

  • Loading...

More Telugu News