KTR: ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై కేటీఆర్ అసంతృప్తి... రూ. లక్ష ఫైన్

KTR displeased as directed to impose fine on Illendu muncipal chairman
  • ఇల్లెందులో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన కేటీఆర్
  • కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు
  • చైర్మన్ నుంచి జరిమానా వసూలు చేయాలంటూ కలెక్టర్ కు కేటీఆర్ ఆదేశం
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇల్లెందులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని ఇల్లెందు పట్టణంలో భారీస్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై కేటీఆర్ అసహనం ప్రదర్శించారు. ఫ్లెక్సీలతో హంగామా చేసేవాళ్లు నాయకులు కాలేరని, ప్రజాసేవతోనే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలని హితవు పలికారు. అంతేకాదు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు దమ్మాలపాటి వెంకటేశ్వర్లుపై రూ.లక్ష జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
KTR
Illendu
Muncipal Chairman
Flexy
Fine
Pattana Pragathi

More Telugu News