Chiranjeevi: హైదరాబాదులో 'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తకావిష్కరణ

  • చిరంజీవిపై పుస్తకం రాసిన సినీ పాత్రికేయుడు వినాయకరావు
  • పార్క్ హయట్ హోటల్లో ఆవిష్కరణ కార్యక్రమం
  • హాజరైన రామ్ చరణ్, అల్లు అరవింద్, టి.సుబ్బిరామిరెడ్డి
Megastar The Legend book released in Hyderabad

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఎవరి అండ లేకుండా స్వయంప్రతిభతో ఎదిగిన చిరంజీవిని అభిమానులు మెగాస్టార్ గా తమ హృదయాల్లో నిలుపుకున్నారు. తాజాగా ఆయన జీవితచరిత్రతో సినీ పాత్రికేయుడు వినాయకరావు 'మెగాస్టార్ ది లెజెండ్' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులోని పార్క్ హయట్ హోటల్ లో ఘనంగా జరిగింది. రామ్ చరణ్, అల్లు అరవింద్, మురళీమోహన్, కె.రాఘవేంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

More Telugu News