SI: వాట్సాప్ లో కలకలం రేపి కనిపించకుండా పోయిన ఎస్సై ఆచూకీ లభ్యం

Police found missing cop at Kadapa district
  • ఇదే నా చివరి మెసేజ్ అంటూ వాట్సాప్ లో పోస్టు చేసిన రుద్రవరం ఎస్సై
  • సెల్ స్విచాఫ్ చేయడంతో తీవ్ర ఆందోళన
  • సెల్ లొకేషన్ ద్వారా కడప జిల్లాలో ఉన్నట్టు గుర్తింపు
  • ఇటీవలే ఎస్సైని మందలించిన ఉన్నతాధికారులు
కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ విష్ణు నారాయణ ఇదే నా చివరి మెసేజ్ అంటూ వాట్సాప్ లో పోస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియలేదు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండడంతో ఆయన పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో, పోలీసు బృందాలు తీవ్ర గాలింపు అనంతరం ఎస్సై విష్ణు నారాయణ ఆచూకీ కనుగొన్నారు. సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఎస్సై కడప జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఎస్సైని కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇటీవల ఓ వ్యవహారంలో ఎస్సై విష్ణునారాయణను ఉన్నతాధికారులు పిలిపించి మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన ఆయన సెల్ స్విచాఫ్ చేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై ఆళ్లగడ్డ డీఎస్పీ సదరు ఎస్సైతో మాట్లాడి నచ్చచెప్పారు. దాంతో, విధులకు హాజరయ్యేందుకు ఎస్సై విష్ణునారాయణ సంసిద్ధత వ్యక్తం చేశారు.
SI
Rudravaram
Kurnool District
Vishnu Narayana
Kadapa District

More Telugu News