America: 'నమస్తే ట్రంప్' కార్యక్రమాన్ని పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటున్న పెద్దన్న

Trumph fhida about Indian hospitality
  • ఇటీవల భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
  • ఇక్కడి అతిథ్యంలో ఉబ్బితబ్బిబ్బయిన వైనం 
  • ఎక్కడికి వెళ్లినా అదే ప్రస్తావన

ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ భారతీయ అమెరికన్ల ఓట్ల వేటలో ఉన్నాడో, నిజంగానే భారతీయుల అతిథ్యానికి ఫిదా అయి తరచూ గుర్తు చేసుకుంటున్నాడో గాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే భారత్ పర్యటన అనుభవాలనే ప్రస్తావిస్తున్నాడు. ముఖ్యంగా అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమాన్ని, మోదీ ఆతిథ్యాన్ని ప్రస్తావిస్తూ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. తాజాగా సౌత్ కరోలినాలో జరిగిన ర్యాలీలో ఈ అంశాలు ప్రస్తావిస్తూ 'భారత్ లో అద్భుతమైన నాయకుడు ఉన్నాడు' అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

'భారత్ ప్రధాని మోదీతో కలిసి తిరిగాను. అక్కడి ప్రజలు ఆయనను బాగా అభిమానిస్తారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి. అక్కడి అతిథ్యానికి పొంగిపోయాను. అక్కడి జనసమూహం చూసి ఆశ్చర్యపోయాను. భారత్ వెళ్లి వచ్చిన నేను అక్కడి జన సమూహం చూశాక ఇక ఎక్కడికి వెళ్లి జన సమూహన్ని చూసినా పెద్దగా ఆశ్చర్యపోకపోవచ్చు' అంటూ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ దంపతులు భారత్ లో పర్యటించిన విషయం తెలిసిందే.

America
Trumph
India
Hospitality

More Telugu News