Ayyanna Patrudu: 'ఎల్లువొచ్చి గోదారమ్మ...' పాటకు యాంకర్లతో కలిసి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టెప్పులేస్తే... వీడియో ఇదిగో!

Ayyannapatrudu Dance Goes Viral
  • విశాఖపట్నంలో అయ్యన్న కుమారుడి పెళ్లి
  • రిసెప్షన్ లో యాంకర్లతో అయ్యన్న డ్యాన్స్
  • ఆపై 'గున్నా గున్నా మామిడి' పాటకు నృత్యం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, యాంకర్లతో కలిసి 'ఎల్లువోచ్చి గోదారమ్మ..' పాటకు వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశాఖపట్నంలో అయ్యన్న కుమారుడి వివాహం వైభవంగా జరుగగా, రిసెప్షన్ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇద్దరు యాంకర్లు 'దేవత' సినిమాలోని ఈ పాటకు స్టెప్పులేస్తుండగా, అయ్యన్నపాత్రుడు, శోభన్ బాబు మాదిరిగా స్టెప్పులేశారు. లయబద్ధంగా ఆయన డ్యాన్స్ వేస్తుంటే, చుట్టూ ఉన్నవారంతా అరుపులు, కేకలతో హోరెత్తించారు. ఆపై తన బంధు మిత్రులతో కలిసి 'గున్నా గున్నా మామిడి...' పాటకు కూడా ఆయన డ్యాన్స్ చేశారు.

ఆపై ఇదే వీడియోలో నూతన వధూవరులు డ్యాన్స్ చేశారు. ఇటీవలి సూపర్ హిట్ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' నుంచి 'హీజ్ సో క్యూట్' పాటకు కూడా యాంకర్లు డ్యాన్స్ వేయించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Ayyanna Patrudu
Marriage
Dance
Viral Videos

More Telugu News