హైదరాబాద్‌లో 11 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు
- ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఘటన
- బస్సులో 11 మంది చిన్నారులు
- కూలీ పనులు చేయించడానికి తీసుకొచ్చిన వైనం
'ఎల్బీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఓ బస్సులో చిన్నారులు ఉన్న విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో వారిని వెంటనే కాపాడి సైదాబాద్‌లోని చిన్నారుల శిబిరానికి పంపారు. ఆ చిన్నారులను ఛత్తీస్‌గఢ్ నుంచి కొందరు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారితో కూలీ పనులు చేయించాలనుకున్నారు' అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.