Team New Zealand: న్యూజిలాండ్ ఆలౌట్... భారత్ కు స్వల్ప ఆధిక్యం!

First Innings Lead for India
  • పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్
  • ఇండియాకు 7 పరుగుల ఆధిక్యం
  • కాసేపట్లో భారత్ రెండో ఇన్నింగ్స్
క్రీస్ట్ చర్చ్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక్కడి పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తూ ఉండటంతో, చెలరేగిన భారత బౌలర్లు రెండో రోజు మొత్తం 10 వికెట్లనూ పడగొట్టారు.

షమీకి నాలుగు, బుమ్రాకు మూడు వికెట్లు లభించగా, జడేజా రెండు, ఉమేశ్ యాదవ్ లకు ఒక వికెట్ లభించాయి. దీంతో ఇండియాకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మరికాసేపట్లో ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుండగా, న్యూజిలాండ్ పేసర్లు బౌల్ట్, జెమీసన్, వాగ్నర్ ల నుంచి వచ్చే నిప్పులు చెరిగే బంతులను టాప్ ఆర్డర్ ఎలా ఎదుర్కొంటుందన్న అంశంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
Team New Zealand
Team India
Cricket
Test

More Telugu News