Python: టవల్ ను అమాంతం మింగేసిన కొండచిలువ... బయటకు తీసిన వైద్యులు... వీడియో ఇదిగో!

  • ఆస్ట్రేలియాలో ఘటన
  • పెంపుడు అనకొండను బీచ్ కు తీసుకెళ్లిన వ్యక్తి
  • ఆకలేసి టవల్ ను మింగి అవస్థలు
Python Swallowed Beach Towel

ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు వన్య ప్రాణులకు ఎంత ఇబ్బందులు కలిగిస్తాయో తెలియజెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. ఓ కొండచిలువ, బీచ్ టవల్ ను మొత్తం మింగేసి, ఇబ్బంది పడుతూ ఉండగా, వైద్యులు చాకచక్యంతో దాన్ని బయటకు తీశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరుగగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.

ఇక ఈ కొండ చిలువను సాశ్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. దీనికి మౌంటీ అని పేరు కూడా పెట్టాడు. ఓ రోజు దాన్ని తీసుకుని బీచ్ కి వెళ్లగా, ఆ సమయంలో ఆకలేసిన కొండచిలువ, ఎదురుగా కనిపించిన టవల్ ను గుటుక్కున మింగేసింది. ఆ రోజు సాయంత్రం దానికి స్నాక్స్ తినిపిద్దామని సాశ్ ప్రయత్నించిన వేళ, అది అవస్థ పడుతూ ఉందని గమనించి, హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. దాని కడుపులో జీర్ణం కాకుండా మిగిలిపోయిన భారీ పదార్థం ఉందని గమనించిన వైద్యులు, దాన్ని బయటకు తీశారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News