Carona Virus: తిరుపతిలో విదేశీయుడికి ‘కరోనా’అనుమానం..‘రుయా’కు తరలింపు

Carona virus suspected foreigner in Tirupathi
  • తిరుపతి సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి వచ్చిన తైవాన్ వాసి
  • కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం
  • ‘రుయా’లోని ఐసోలేటెడ్ వార్డులో వైద్యపరీక్షలు
తిరుపతిలో కరోనా అనుమానిత కేసు వెలుగు చూసింది. తైవాన్ నుంచి వచ్చిన చెన్ చున్ హాంగ్ అనే వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీంతో, తిరుపతిలోని రుయా ఆసుపత్రికి చున్ హాంగ్ ని తరలించారు. ఐసోలేటెడ్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, తిరుపతి సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి వచ్చిన చున్ హాంగ్ అనారోగ్యం పాలయ్యారు. జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు.
Carona Virus
suspect
Tirupati
Taiwan person

More Telugu News