Chandrababu: విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసుల నమోదు.. పోలీసుల అదుపులో ఇద్దరు

Vizag police register cases against who protests against chandrababu
  • విశాఖ విమానాశ్రయంలో బాబును అడ్డుకున్న ఘటన
  • ఆత్మహత్యకు యత్నించిన  జేటీ రామారావు, వైసీపీ నాయకురాలు కృపాజ్యోతిపై కేసు నమోదు
  • టీడీపీ నాయకులపైన కూడా

రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని అడ్డుకున్న ఘటనలో నిందితులపై కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో చంద్రబాబు యాత్రను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జేటీ రామారావుపైనా, వైసీపీ నాయకురాలు ఎన్. కృపాజ్యోతిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. జేటీ రామారావు, కృపాజ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News