Mahesh Babu: ‘ఏ బిగ్ హగ్’ అంటూ సంతోషం వ్యక్తం చేసిన హీరో మహేశ్​ బాబు

Hero Mahesh Babu over whelmed
  • ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలై యాభై రోజులు 
  • చిత్రయూనిట్ ను అభినందిస్తూ మహేశ్ ట్వీట్
  • నటి విజయశాంతి, హీరోయిన్ రష్మిక కు ట్యాగ్ చేసిన మహేశ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు‘ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా  హీరో మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చిత్రం ద్వారా తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకరలకు ‘ఏ బిగ్ హగ్’, చిత్రయూనిట్ కు ‘థ్యాంక్స్’ తెలుపుతున్నానని అన్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం ద్వారా మళ్లీ నటించిన నటి విజయశాంతి, హీరోయిన్ రష్మిక, డీవోపీ రత్నవేలు, నటుడు ప్రకాశ్ రాజ్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ లకు మహేశ్ ట్యాగ్ చేశాడు.  
Mahesh Babu
Tollywood
SarileruNeekevvaru
50 Days
Anili Ravipudi

More Telugu News