Vijayashanti: విజయశాంతితో కలిసున్న ఫొటోను పోస్టు చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనిల్‌ రావిపూడి

Its been a memorable experience working with you vijayashanthi  Madam
  • మీతో కలిసి పని చేయడం చిరకాలం గుర్తుండిపోయే ఓ అనుభవం
  • చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్‌పై మీరు పునరాగమనం చేశారు
  • ఆ సినిమాకు దర్శకత్వం వహించడం నాకు దక్కిన గౌరవం

సినీనటి విజయశాంతితో దిగిన ఓ ఫొటోను పోస్టు చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మీతో కలిసి పని చేయడం చిరకాలం గుర్తుండిపోయే ఓ అనుభవం విజయశాంతి మేడమ్.. చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్‌పై మీరు పునరాగమనం ఇచ్చిన సినిమాకు దర్శకత్వం వహించిన అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మీరు నటించిన తీరు నటనా నైపుణ్యాలు శాశ్వతమని నిరూపించింది' అని పేర్కొన్నారు.

కాగా, సరిలేరు నీకెవ్వరు సినిమాకు విజయశాంతి నటన ప్లస్ పాయింట్ అయింది. సినిమా షూటింగ్‌ సందర్భంగా తీసుకున్న ఫొటోను అనిల్ రావిపూడి పోస్ట్ చేశారు. తన సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ పోస్టు చేశారు. ఈ ఫొటోలో వెనుక మహేశ్‌ బాబు కూడా ఉన్నాడు.

  • Loading...

More Telugu News