India: హనుమ విహారి, పుజారా హాఫ్ సెంచరీలు!

Vihari and Pujara Half Centuries in Second Test
  • న్యూజిలాండ్ తో రెండో టెస్టులో టాప్ ఆర్డర్ విఫలం
  • నిలబడి ఆడుతున్న హనుమ విహారి 53 పరుగుల వద్ద అవుట్
  • భారత్ స్కోరు 194/5
టాప్ ఆర్డర్ విఫలమైన వేళ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారీ నిలబడి ఆడుతూ న్యూజిలాండ్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్కోరు ముందుకు కదిలించారు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ, వీరిద్దరూ తమ వ్యక్తిగత స్కోరును పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలను సాధించారు.

ఆపై హనుమ విహారి వాగ్నర్ వేసిన ఓ బంతికి కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ గా పెవిలియన్ దారి పట్టాడు. విహారి 70 బంతులను ఎదుర్కొని 55 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు కాగా, పుజారా 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంపైర్లు టీ విరామాన్ని ప్రకటించారు. 
India
Team New Zealand
Cricket
Test

More Telugu News