India: కోహ్లీ 3, రహానే 7... పేలవంగా సాగుతున్న భారత బ్యాటింగ్!

India Losses Top Order in Test with New Zeland
  • లంచ్ విరామం అనంతరం కోహ్లీ అవుట్
  • నిరాశ పరిచిన అజింక్య రహానే
  • 33 ఓవర్లకు 118/4
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 114 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఓపెనర్ పృథ్వీషా అర్థ సెంచరీతో రాణించగా, మరే బ్యాట్స్ మెన్ కూడా మెప్పించలేక పోయారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులకు అవుట్ కాగా, ఆపై వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, లంచ్ విరామం అనంతరం 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ దారి పట్టాడు. భారీ అంచనాలున్న అజింక్యా రహానే సైతం నిరాశ పరుస్తూ, 7 పరుగుల స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం వన్ డౌన్ గా దిగిన ఛటేశ్వర్ పుజారా 31 పరుగులతో క్రీజులో ఉండగా, అతనికి హనుమ విహారి వచ్చి జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 118 పరుగులు.
India
Team New Zealand
Cricket
Test
Virat Kohli

More Telugu News