Alla Ramakrishnareddy: కూలిన వివాహ వేదిక.. స్వల్పంగా గాయపడిన మంగళగిరి ఎమ్మెల్యే

MLA Alla Ramakrishna Reddy injured in a Marriage
  • ఉండవల్లిలో వివాహ వేడుకకు హాజరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • ఆర్కే వధూవరులను ఆశీర్వదిస్తుండగా ఘటన
  • ఎమ్మెల్యే కుడికాలికి గాయం
  • గుంటూరు ఆసుపత్రిలో చికిత్స
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కాలికి గాయమైంది. ఉండవల్లిలో ఓ పెళ్లికి హాజరైన ఆర్కే, ఉన్నట్టుండి పెళ్లి వేదిక కూలిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. ఆర్కే వధూవరులను ఆశీర్వదిస్తుండగా ఈ ఘటన జరిగింది. వేదికతోపాటే ఆయన కూడా కిందపడిపోయారు. కుడిపాదానికి దెబ్బతగలడంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా, ఎమ్మెల్యే కిందపడిపోవడంతో పెళ్లి వేడుకలో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది.
Alla Ramakrishnareddy
Undavalli
Marriage
Injury
Guntur
Mangalagiri

More Telugu News