Jagan: అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం జగన్

AP CM Jagan offers Chadar to Ajmer Sharif Darga
  • ముస్లింకు పవిత్రస్థలంగా పేరుగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గా
  • సీఎంను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసిన ముస్లిం మతగురువులు, ప్రతినిధులు
  • ట్విట్టర్ లో ఫొటోలు పోస్టు చేసిన ఏపీ సీఎంఓ

ముస్లింకు పవిత్రస్థలంగా పేరుగాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఏపీ సీఎం జగన్ చాదర్ సమర్పించారు. దర్గా ప్రతినిధులు, ముస్లిం మతగురువులు సీఎంను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి ఏపీ ప్రభుత్వం తరఫున పవిత్ర వస్త్రాలతో కూడిన చాదర్ ను జగన్ అందించారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ సీఎంఓ ట్విట్టర్ లో వెల్లడించింది. సీఎం చాదర్ సమర్పిస్తున్న ఫొటోలను కూడా పోస్టు చేసింది.

  • Loading...

More Telugu News