Manchu Manoj: ఈ క్యారెక్టర్ పేరు 'భక్తవత్సలం నాయుడు': మంచు మనోజ్

Manchu Manoj comments on Mohan Babu new movie
  • ఆకాశమే నీ హద్దురా చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న మోహన్ బాబు
  • ట్విట్టర్ లో తన గెటప్ ను పంచుకున్న మోహన్ బాబు
  • ఇడుగో వచ్చేశాడంటూ స్పందించిన మంచు మనోజ్
  • వెండితెరపై చూసేందుకు ఆగలేకపోతున్నామంటూ ట్వీట్

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం 'ఆకాశమే నీ హద్దురా' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్ర పోషిస్తున్నారు. తాజాగా తన రోల్ కు సంబంధించిన గెటప్ ను మోహన్ బాబు ట్విట్టర్ లో పంచుకోగా, దానిపై ఆయన తనయుడు మంచు మనోజ్ స్పందించారు.

"ఇడుగో వచ్చేశాడు. 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో సూర్యాకు మార్గదర్శిగా వ్యవహరించే ఈ క్యారెక్టర్ పేరు 'భక్తవత్సలం నాయుడు'. వెండితెరపై ఆయన అసలు పేరుతో నటించడాన్ని చూసేందుకు ఇక ఎదురుచూడలేం. నువ్వంటే మాకెంతో ఇష్టం నాన్నా. ఆకాశమే నీ హద్దురా చిత్రయూనిట్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం" అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News