Mohan Babu: పవర్ ఫుల్ గెటప్పులో మోహన్ బాబు... ఫొటో ఇదిగో!

Mohan Babu reveals his look in Aakasame Nee Haddura
  • సూర్య హీరోగా ఆకాశమే నీ హద్దురా చిత్రం
  • కీలకపాత్ర పోషిస్తున్న మోహన్ బాబు
  • తన లుక్ ను ట్విట్టర్ లో పంచుకున్న మోహన్ బాబు

తమిళ నటుడు సూర్య హీరోగా వస్తున్న 'ఆకాశమే నీ హద్దురా' చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు మోహన్ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన లుక్ ను మోహన్ బాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. భారత వాయుసేనకు చెందిన అధికారిగా మోహన్ బాబు ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News