Biggest Explosion: బిగ్​ బ్యాంగ్‌ తర్వాత అతి పెద్ద విస్పోటనం.. గుర్తించిన శాస్త్రవేత్తలు

  • కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు
  • గత రికార్డుల కంటే ఐదు రెట్ల శక్తి విడుదల
  • ఈ ప్రక్రియకు వందల మిలియన్ సంవత్సరాలు పట్టిందని గుర్తింపు
Astronomers Detect Biggest Explosion After Big Bang

బిగ్ బ్యాంగ్ తర్వాత ఈ విశ్వంలో అతి పెద్ద విస్పోటనం జరిగిందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదూర నక్షత్ర మండలపై అధ్యయనం చేస్తుండగా ఈ విషయాన్ని కనుగొన్నారు. వందల మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో నక్షత్ర మండల కేంద్రంలో ఏర్పడిన అతి పెద్ద బ్లాక్ హోల్ కారణంగా ఈ విస్పోటనం జరిగిందని చెబుతున్నారు. ఫలితంగా గత రికార్డులకంటే ఏకంగా ఐదు రెట్లు అధికంగా శక్తి విడుదలైందని అంటున్నారు.

 ఇది అత్యంత శక్తిమంతమైన ప్రక్రియ అని అంతర్జాతీయ రేడియో ఆస్ట్రానమీ రీసర్చ్ సెంటర్‌‌కు చెందిన కర్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పెలానీ జాన్‌స్టన్ హొలిట్ తెలిపారు. ఈ విస్ఫోటనం ఇంత పెద్దగా ఎందుకు జరిగిందో తకు తెలియదని, కాకపోతే ఇది చాలా నెమ్మదిగా జరిగినట్టు గుర్తించామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కొన్ని వందల మిలియన్‌ సంవత్సరాలు పట్టిందన్నారు. భూమి నుంచి 390 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒపిచస్ గెలాక్సీ క్లస్టర్‌‌లో ఇది జరిగిందని  తెలిపారు.

More Telugu News