america: సరదా కోసం.. ప్రియుణ్ణి సూట్‌కేసులో పెట్టి తాళం వేసిన యువతి.. ఊపిరాడక మృతి!

girl arrested by police killing her boy friend
  • ప్రియుడితో దాగుడు మూతలు ఆడిన ప్రియురాలు
  • ప్రియుడిని సూట్‌కేసులో పెట్టి తాళం వేసిన వైనం
  • ఆపై మద్యం మత్తులో నిద్ర
  • తెల్లారి లేచి చూసే సరికి విగతజీవిగా బాయ్‌ఫ్రెండ్‌
రాత్రంతా సూట్‌కేసులో ఉండిపోవడంతో ఊపిరాడక ఓ యువకుడు మృతి చెందిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ఘనటపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి ప్రియురాలిని అరెస్ట్‌ చేసి, ఈ ఘటన గురించి వివరించారు. ఫ్లోరిడాలో సారా బూన్‌ అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్ టోర్రెస్‌తో కలిసి ఉంటోంది.

వారిద్దరు గదిలో మద్యం తాగి సరదాగా ఇంట్లో ఆడుకున్నారు. దాగుడుమూతల ఆటల పేరుతో  తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం వేసింది. అనంతరం తన గదిలోకి వెళ్లిపోయి, నిద్రపోయింది. దీంతో జార్జ్‌ ఊపిరాడక మృతి చెందాడు. నిద్రలేచి సూట్‌కేస్‌ తెరిచి చూసిన ప్రియురాలు షాక్‌ అయింది.

మద్యం మత్తులో వుండిపోవడంతో, జార్జ్ కు ఊపిరాడదన్న విషయాన్ని పట్టించుకోలేదని పోలీసులకు ఆ అమ్మాయి తెలిపింది. అయితే, ఆమె ఉద్దేశపూర్వకంగానే అతడిని చంపిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
america
Crime News

More Telugu News