IYR Krishna Rao: జగన్‌ని విశాఖ విమానాశ్రయంలో ఆపడం ఎంత తప్పో ఇదీ అంతే తప్పు: ఐవైఆర్‌

iyr krishna rao about tdp ycp rule
  • జై అమరావతి అంటే అమరావతికి ప్రవేశం
  • జై విశాఖ అంటే విశాఖ ప్రవేశం మూర్ఖత్వం
  • ఎవరి విధానాలు వారివి
  • దేశమంతా తిరిగి చెప్పుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇస్తుంది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నిన్న విశాఖపట్నం విమానాశ్రయంలో అడ్డుకున్న ఘటనపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్‌ను అదే విమానాశ్రయంలో అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

'ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని విశాఖ విమానాశ్రయంలో ఆపడం ఎంత తప్పో ఈ రోజు ఇది కూడా అంతే తప్పు. జై అమరావతి అంటే అమరావతికి ప్రవేశం, జై విశాఖ అంటే విశాఖ ప్రవేశం మూర్ఖత్వం. ఎవరి విధానాలు వారివి. రాష్ట్రమంతా, దేశమంతా తిరిగి చెప్పుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇస్తుంది. దానిని హరించడం ప్రమాదకరం' అని ట్వీట్ చేశారు. 
IYR Krishna Rao
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News