Ankit Sharma: 400 కత్తిపోట్లు.. 6 గంటల సేపు నరకం.. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు: అంకిత్ శర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడి

IB officer Ankit Sharma post mortem report
  • శరీరంలోని ప్రతి అవయవాన్ని ఛిద్రం చేశారు
  • పేగులను కూడా బయటకు లాగారు
  • ఆరుగురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొని ఉండొచ్చు

ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టి హత్య చేయడం గురించి కనీసం మనం ఎక్కడా విని ఉండం. ప్రపంచ చరిత్రలో ఇంత కంటే క్రూరంగా ఒక వ్యక్తిని చంపడం జరిగి ఉండకపోవచ్చు. ఇంటెలిజెన్స్ ఉద్యోగి అంకిత్ శర్మ శవం ఢిల్లీలోని డ్రైనేజీ కాలువలో లభించిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టంలో ఒళ్లు జలదరించే భయంకర నిజాలు వెల్లడయ్యాయి. తమ విధినిర్వహణలో ఇంత దారుణంగా శరీరంలోని అన్ని భాగాలను పొడుస్తూ చంపడాన్ని ఇంతవరకు చూడలేదని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు పేర్కొన్నారు.

అంకిత్ శర్మను 400 సార్లు పొడిచారని పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఒక్క అవయవాన్ని కూడా వదలకుండా, ప్రతి భాగాన్ని ఛిద్రం చేశారు. పేగులు బయటకు లాగారు. సుమారు 4 నుంచి 6 గంటల సేపు ఈ దారుణకాండ కొనసాగి ఉంటుంది. కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ హత్యాకాండలో పాల్గొని ఉంటారు. ఆ తర్వాత మృతదేహాన్ని మురికి కాలువలో పడేశారు. అంకిత్ శర్మ పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించిన వివరాలు ఇవి.

  • Loading...

More Telugu News