Iran: ఇరాన్ దేశ ఉపాధ్యక్షురాలికి సోకిన కరోనా వైరస్

  • ఇరాన్ ను కబళిస్తున్న కరోనా వైరస్
  • ఇప్పటి వరకు ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 26
  • ఒక్క రోజులోనే ఈ మహమ్మారి బారిన పడ్డ 106 మంది  
Iran Vice President Tests Positive For Corona Virus

ఇరాన్ దేశాన్ని కరోనా వైరస్ కబళిస్తోంది. ఇప్పటికే ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ కు కరోనా సోకింది. తాజాగా ఏకంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మస్సౌమీ ఎబ్తేకర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమెను సొంత నివాసంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ హెడ్ మొజ్తబాకు కూడా ఈ మహమ్మారి సోకింది. దీంతో, తనకు తాను నిర్బంధం విధించుకున్నానని ఓ వీడియో ద్వారా ఆయన వెల్లడించారు.

కరోనా బారిన పడి ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. కరోనా సోకిన వారి సంఖ్య 245కి చేరుకుందని... వీరిలో 106 మంది ఒక్క రోజులోనే ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. కరోనా భయాలతో ఇరాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

More Telugu News