Online: ఆన్‌లైన్‌లో షర్ట్ ఆర్డర్ చేసి లక్ష పోగొట్టుకున్న హైదరాబాద్ కుర్రాడు

youth complaint to cyber crime police over one lakh fraud
  • క్యూ షాప్ వెబ్‌సైట్‌లో రూ. 500 విలువైన షర్ట్ ఆర్డర్
  • రాకపోవడంతో కస్టమర్ కేర్‌కు ఫోన్
  • వారు పంపిన మెసేజ్‌లో వివరాలు నింపి నిండా మునిగిన యువకుడు

ఆన్‌లైన్‌లో షర్ట్ ఆర్డర్ చేసిన ఓ కుర్రాడు సైబర్ క్రైం నేరగాళ్ల బారినపడి లక్ష రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. మారేడ్‌పల్లికి చెందిన రవి ‘క్యూషాప్’ అనే వెబ్‌సైట్‌లో రూ.500 విలువైన ఓ షర్ట్‌ను ఆర్డర్ చేశాడు. బుక్ చేసిన వెంటనే రెండు రోజుల్లో షర్ట్ డెలివరీ అవుతుందని అతడి మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అయితే, ఐదు రోజులైనా రాకపోవడంతో క్యూ షాప్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

అతడు ఫోన్ చేసిన వెంటనే రంగంలోకి దిగిన నేరగాళ్లు.. షర్ట్ డెలివరీలో సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆర్డర్ రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరో ఐదు నిమిషాల్లో మొబైల్‌కు మెసేజ్ వస్తుందని, అందులో వివరాలు నమోదు చేస్తే చెల్లించిన 500 రూపాయలు వెనక్కి వస్తాయని నమ్మబలికారు. అనుకున్నట్టే ఆ తర్వాత మెసేజ్ రావడం, అందులో వివరాలు నమోదు చేయడం జరిగిపోయాయి. అయితే, ఆ తర్వాత కాసేపటికే వచ్చిన మరో మెసేజ్ చూసిన రవికి మైండ్ బ్లాంక్ అయింది. లక్ష రూపాయలు డ్రా అయినట్టు బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు. మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News