Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను మింగిన గోడ

Three dead in wall collapse in Hyderabad
  • హబీబ్‌నగర్ పరిధిలో ఘటన
  • నిద్రిస్తున్న చిన్నారులపై కూలిన గోడ
  • మృతుల్లో నాలుగు నెలల చిన్నారి

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌,  హబీబ్‌నగర్ పరిధిలోని అఫ్జల్‌సాగర్ రోడ్డు మాన్‌గిరి బస్తీలో నిన్న రాత్రి జరిగిందీ ఘటన. ఈ ఘటనలో ముక్కుపచ్చలారని చిన్నారులు రోషిణి (6), సారిక (3), నాలుగు నెలల చిన్నారి పావని ప్రాణాలు కోల్పోయారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News