Rajinikanth: రజనీకాంత్ తో బేర్ గ్రిల్స్ స్పెషల్ ఎపిసోడ్.. ప్రసార తేదీని ప్రకటించిన డిస్కవరీ చానల్

Discovery chjannel announced telecast date of Rajinikanth with Bear Grylls episdode
  • మనుగడ పోరాటాలతో గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్
  • మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్త ఆదరణ
  • తాజాగా రజనీకాంత్ తో ఎపిసోడ్ చిత్రీకరించిన బేర్ గ్రిల్స్ బృందం

ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ చేసే మనుగడ పోరాటాలు డిస్కవరీ చానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరిట ప్రసారం అవుతుంటాయి. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. మాజీ సైనికుడు బేర్ గ్రిల్స్ తాను మాత్రమే కాదు, అప్పుడప్పుడు ప్రపంచ ప్రముఖులను కూడా వెంటబెట్టుకుని వెళ్లి 'ఇంటూ ద వైల్డ్' పేరిట అడవుల్లో సాహసాలు చేస్తుంటాడు. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఎపిసోడ్ చేసిన బేర్ గ్రిల్స్ కొన్నివారాల కిందట తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కర్ణాటక అడవుల్లో కార్యక్రమం పూర్తి చేశాడు. ఇప్పుడీ కార్యక్రమం ప్రసారమయ్యే తేదీని డిస్కవరీ చానల్ ప్రకటించింది. మార్చి 23 రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రోమో వీడియో రిలీజ్ చేశారు.

  • Loading...

More Telugu News