Chandrababu: చంద్రబాబుకు విశాఖ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ టికెట్ తీసిన పోలీసులు!

Police tries to shift Chandrababu to Hyderabad
  • విశాఖలో చంద్రబాబు అరెస్ట్
  • లాంజ్ నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం
  • తాను విశాఖలో వివాహ కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉందన్న చంద్రబాబు
  • విమానం ఎక్కించే యోచనలో పోలీసులు!
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ముందుకు కదలని నేపథ్యంలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబును ఈ సాయంత్రం విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ కు తీసుకెళ్లారు. అయితే, ఆయనను ఇప్పుడు లాంజ్ నుంచి బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎలా తరలిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించగా, సీఆర్పీసీ 151 కింద అరెస్ట్ చేశామని, శాంతిభద్రతల సమస్య ఉందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖలో వివాహ కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉందని అన్నారు. అయితే అధికారులు ఆయనకు విశాఖ నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ టికెట్ తీశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వెంట ఉన్న నేతలను లాంజ్ నుంచి బయటికి పంపి, చంద్రబాబును విమానం ఎక్కించే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.
Chandrababu
Vizag
Police
Flight
Hyderabad

More Telugu News