Chandrababu: చంద్రబాబును అరెస్ట్ చేసి వీఐపీ లాంజ్ కు తరలించిన పోలీసులు

Police arrests TDP supremo Chandrababu at Vizag airport
  • భద్రతా కారణాల రీత్యా ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వెస్ట్ జోన్ ఏసీపీ పేరిట నోటీసులు జారీ
  • చంద్రబాబును విజయవాడ లేక హైదరాబాద్ కు పంపించే అవకాశం
విశాఖలో పర్యటించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు పంతం నెరవేరేలా కనిపించడంలేదు. ఆయనను భద్రత కారణాల రీత్యా ముందస్తుగా అరెస్ట్ చేసి ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ కు తరలించారు. విశాఖ పశ్చిమ మండలం ఏసీపీ పేరిట ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆపై అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో చంద్రబాబును మళ్లీ బయటికి పంపకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ఆయన్ను విజయవాడ పంపించేస్తారా లేక హైదరాబాద్ తరలిస్తారా అనే విషయంపై స్పష్టత రాలేదు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటన కోసం వచ్చిన చంద్రబాబును వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
Chandrababu
Arrest
Police
Vizag
Airport

More Telugu News