Sehwag: ఆమె ఓ రాక్‌స్టార్‌‌: షెఫాలీ వర్మపై సెహ్వాగ్​ కామెంట్

Virender Sehwag hails Shafali Verma calls her a rockstar
  • యువ ఓపెనర్‌‌పై సెహ్వాగ్ ప్రశంసల వర్షం
  • సెమీస్‌ చేరిన భారత్‌కు అభినందన
  • న్యూజిలాండ్‌పై సత్తా చాటిన షెఫాలీ వర్మ
టీ20 వరల్డ్‌కప్‌లో గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు యువ ఓపెనర్‌‌ షెఫాలీ వర్మపై మాజీ క్రికెటర్‌‌ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె ఓ రాక్‌స్టార్‌‌ అని కొనియాడాడు. అలాగే, కివీస్‌పై ఉత్కంఠ విజయం సాధించి సెమీఫైనల్ చేరిన భారత జట్టును సెహ్వాగ్ అభినందించాడు. అమ్మాయిల ప్రదర్శన  తనను ఎంతగానో సంతోషపరిచిందని ట్వీట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. షెఫాలీ వర్మ 34 బంతుల్లోనే 46 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. సెమీస్‌ చేరిన భారత జట్టును వీవీఎస్‌ లక్ష్మణ్ కూడా అభినందించాడు.
Sehwag
Shafali Verma
T20 World Cup
Team India

More Telugu News