Paritala Ravi: పరిటాలవారి పెళ్లిసందడి.. ఫొటోలు ఇవిగో!

Paritala Siddhartha Marriage
  • పరిటాల రవి, సునీత దంపతుల రెండో కుమారుడి వివాహం
  • ఈ సాయంత్రం 6 గంటలకు వివాహ రిసెప్షన్
  • హాజరుకానున్న నారా లోకేశ్, మోహన్ బాబు
దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర, మాజీ మంత్రి పరిటాల సునీత దంపతుల ఇంట పెళ్లి సందడి మొదలైంది. వీరి రెండో కుమారుడు పరిటాల సిద్ధార్థ వివాహం తేజస్వితో జరగబోతోంది. ఈ సాయంత్రం 6 గంటలకు అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని నసనకోట సమీపంలో ఉన్న తిరుమల దేవర ఆలయంలో వివాహ రిసెప్షన్ ను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి టీడీపీ నేత నారా లోకేశ్, సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరుకానున్నారు. రేపు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో, సిద్ధార్థను పెళ్లికుమారుడిని చేయడం, పెళ్లిపందిరి వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సిద్ధార్థను ఆయన తల్లి సునీత, అన్న శ్రీరామ్, వదిన జ్ఞాన ఆశీర్వదించారు.
Paritala Ravi
Parita Sunitha
Paritala Sriram
Paritala Sidharth
Marriage
Reception
Nara Lokesh
Mohan Babu
Telugudesam

More Telugu News