Atchannaidu: అచ్చెన్నాయుడు వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు.. ఎమ్మెల్యే గణేశ్‌ను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

atchannaidu fires on police
  • విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గందరగోళం
  • అచ్చెన్నకు మద్దతుగా నిలిచిన టీడీపీ కార్యకర్తలు
  • పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గణేశ్ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. అక్కడకు వస్తోన్న టీడీపీ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వాహనాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలంతా అచ్చెన్నకు మద్దతుగా నిలవడంతో ఆయన ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారు.

ఎయిర్ పోర్టు దగ్గర ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ను కూడా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత వస్తున్న సందర్బంగా ఎయిర్ పోర్టుకు వచ్చామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తాము పాల్పడడం లేదని, ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

Atchannaidu
Telugudesam
YSRCP
Vizag

More Telugu News