Balakrishna: సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ కి ఒప్పుకున్న బాలయ్య

  • బాలయ్యతో బోయపాటి మూడో సినిమా 
  •  సంగీత దర్శకుడిగా తమన్ 
  • రీమిక్స్ తో ఫ్యాన్స్ ను అలరించనున్న బాలయ్య
Boyapati Movie

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. బాలకృష్ణ సరసన నాయికలుగా శ్రియ .. అంజలిని ఎంపిక చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక బాలకృష్ణ సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో 'స్వాతిలో ముత్యమంత' ఒకటి. 'బంగారాబుల్లోడు' సినిమాలోని ఆ పాట ఇప్పటికీ హుషారెత్తించే పాటనే. ఆ పాటను రీమిక్స్ చేస్తే అభిమానులు ఖుషీ అవుతారని బాలకృష్ణకి తమన్ చెప్పాడట. తన సాంగ్ రీమిక్స్ లో మరోసారి స్టెప్స్ వేసే ఛాన్స్ కి బాలయ్య ఆనందంగా అంగీకరించాడట. ఈ పాటను బాలకృష్ణ - అంజలిపై చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని అంటున్నారు.

More Telugu News