Sandhyarani: విద్యార్థిని మృతి వ్యవహారంలో కానిస్టేబుల్ పై చర్యలు

Cop fired by officials due to insensitive behavior
  • అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థిని సంధ్యారాణి!
  • ఆమె తండ్రిపై పోలీసుల దురుసు ప్రవర్తన
  • కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై బదిలీ వేటు
హైదరాబాద్ లోని పటాన్ చెరులో నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు తరలించే క్రమంలో ఆమె తండ్రి వారిని అడ్డుకున్నాడు. దాంతో శ్రీధర్ రెడ్డి అనే పోలీసు కానిస్టేబుల్ అతడిని కాలితో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ వ్యక్తి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి ఇప్పుడా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు. శ్రీధర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sandhyarani
Private College
Hyderabad
Patancheru
Police
Telangana
KTR

More Telugu News