Reliance jio: చార్జీలు పెంచిన జియోకు షాకిచ్చిన వినియోగదారులు

Custormers shocks Reliance Jio
  • టారిఫ్ చార్జీలు పెంచిన తర్వాత జియోకు తగ్గిన ఆదరణ
  • బీఎస్ఎన్ఎల్‌కు క్యూ కట్టిన కొత్త ఖాతాదారులు
  • ఖాతాదారులు తగ్గినా జియోనే టాప్
టారిఫ్ చార్జీలు పెంచి వినియోగదారులకు షాకిచ్చిన రిలయన్స్ జియోకు ఇప్పుడు ఖాతాదారులు షాకిచ్చారు. జియోను ఎంచుకునే కొత్త ఖాతాదారుల సంఖ్య డిసెంబరులో గణనీయంగా పడిపోయింది. చార్జీలు పెంచకముందు నవంబరులో 5.60 లక్షల మంది కొత్త ఖాతాదారులు జియోను ఎంచుకోగా, టారిఫ్ చార్జీల పెంపు తర్వాత డిసెంబరులో ఆ సంఖ్య ఏకంగా 82,308 మందికి పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఖాతాదారులు క్యూకట్టారు. ఇక, వొడాఫోన్ ఐడియా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా తయారైంది.

టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. డిసెంబరులో 4,26,958 మంది కొత్త చందాదారులు బీఎస్ఎన్ఎల్‌ను ఎంచుకున్నారు. అదే సమయంలో జియోలో చేరిన వారి సంఖ్య 82,308 మందే కావడం గమనార్హం. అయినప్పటికీ మార్కెట్ వాటాలో జియోనే టాప్. 32.14 శాతం వాటాతో టాప్‌లో కొనసాగుతోంది. 28.89 శాతంతో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో 28.43 శాతం మార్కెట్ వాటాతో భారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానంలో ఉంది.  ఇక డిసెంబరు 31తో ముగిసిన నెలలో వొడాఫోన్ ఐడియా 36,44,453 మంది ఖాతాదారులను కోల్పోయింది.
Reliance jio
VIL
Vodafone
Airtel
TRAI

More Telugu News