Ruhani Sharma: రుహానీ శర్మ మరో ఛాన్స్ కొట్టేసింది

  • 'చి ల సౌ'తో కథానాయికగా పరిచయం 
  • 'హిట్' సినిమాతో దక్కిన అవకాశం 
  • నాగశౌర్య జోడీగా మరో సినిమా  
HIT Movie

ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానున్న 'హిట్' సినిమాతో రుహానీ శర్మ పలకరించనుంది. ఈ సినిమాలో విష్వక్సేన్ జోడీగా ఆమె కనిపించనుంది. ఈ సినిమా విడుదలకి ముందే ఆమె మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య కథానాయకుడిగా మహేశ్ కోనేరు ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రుహానీ శర్మను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు.

అయితే రుహానీ శర్మ 2018లోనే 'చి ల సౌ' అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఈ అమ్మడు ఎవరికీ గుర్తుకూడా లేదు. కొంత గ్యాప్ తరువాత 'హిట్' సినిమాతో మళ్లీ వస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.

More Telugu News