Devineni Uma: డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణపై సీబీఐ విచారణ చేయాలి: దేవినేని ఉమ

cbi should inquire about dgp office matter demands devineni uma
  • డీజీపీ ఆఫీసులో నిర్ణయాలు జగన్ సన్నిహితులు తీసుకుంటున్నారు
  • సజ్జల చేస్తోన్న సూచనల మేరకే పోలీసు శాఖలో పోస్టింగ్‌లు 
  • పోలీసుల తీరును కోర్టులు తప్పుపడుతున్నాయి
  • అయినప్పటికీ మార్పురావడంలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణపై సీబీఐ విచారణ చేయాలని, ఆ కార్యాలయంలో నిర్ణయాలు సీఎం జగన్ సన్నిహితులు తీసుకుంటున్నారని ఆరోపించారు.

సజ్జల చేస్తోన్న సూచనల మేరకే పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. పోలీసుల తీరును కోర్టులు తప్పుపడుతున్నా మార్పురావడంలేదని ఆయన మండిపడ్డారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించే స్థాయికి పోలీసులు వెళ్లారని ఆయన విమర్శించారు. కృష్ణాకు వరదలు వచ్చినప్పటికీ నీళ్లు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ సర్కారు అని అన్నారు.
Devineni Uma
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News