Naga Shaurya: నాగశౌర్య సినిమా ఆగిపోలేదట

Avasarala Srinivas Movies
  • నాగశౌర్యకి రెండు హిట్లు ఇచ్చిన అవసరాల 
  • మూడో సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి 
  • తదుపరి షెడ్యూల్ విదేశాల్లో  

నాగశౌర్య కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అశ్వద్ధామ' ఆయన అభిమానులను నిరాశ పరిచింది. అయినా నాగశౌర్య డీలాపడకుండా మిగతా ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఆయన తదుపరి సినిమాల్లో అవసరాల శ్రీనివాస్ సినిమా కూడా వుంది. ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై వివేక్ కూచిభొట్ల స్పందించాడు. తమ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ జరిగిందని అన్నాడు. ఈ సినిమాలో కొంత భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించవలసి ఉందనీ, వీసాల సమస్య కారణంగా ఆ షెడ్యూల్ ఆలస్యమవుతోందని చెప్పాడు. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ సినిమాను పూర్తి చేస్తామనీ, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశాడు. గతంలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య చేసిన రెండు సినిమాలు విజయవంతమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News