Ranga Reddy District: జల్సాల కోసం హత్యలు చేసి.. దోచుకుంటున్న కిరాతకుల అరెస్ట్

Two men arrested in murder cases in Telangana
  • ఒకే రోజు ముగ్గురిని హత్య చేసిన నిందితులు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు
  • నిందితులు ఇద్దరూ స్నేహితులు

సంగారెడ్డి శివారులో జరిగిన హత్యతోపాటు పటాన్‌చెరు మండలంలో ఇటీవల జరిగిన రెండు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు నిందితులకు అరదండాలు వేశారు. నిందితులను రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గోపాలపురానికి చెందిన పొడువు కృష్ణ అలియాస్ అజయ్ (37), బ్యాగరి శ్రీకాంత్ అలియాస్ చందు (25)గా గుర్తించారు. వీరిద్దరూ స్నేహితులని, మద్యానికి బానిసలై జల్సాల కోసం హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం..  సంగారెడ్డి మండలంలోని కల్పగూరుకు చెందిన పాలడుగు కృష్ణ (30) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 9న రాత్రి 11:30 గంటల సమయంలో కంపెనీ బస్సులో సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువు కట్ట వద్ద దిగాడు. అక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఒంటరిగా వెళ్తున్న అతడిని గమనించిన నిందితులు కృష్ణ, శ్రీకాంత్‌లు వెంబడించారు. కన్యకాపరమేశ్వరి ఆలయ సమీపంలో అతడిపై దాడిచేసి చంపేశారు. అతడి వద్దనున్న పర్సు లాక్కున్నారు. అనంతరం అతడిపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు.

ఆ తర్వాత రుద్రారం సమీపంలోని దాబాలో మద్యం తాగిన నిందితులు.. దాబా ఎదురుగా ఉన్న గుడిసెలో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై కత్తితో దాడిచేసి చంపేశారు. ఈ మూడు హత్యల కేసులను సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించారు. తాజాగా నిన్న వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

  • Loading...

More Telugu News